నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు
నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-పట్టణ సమీపంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ ప్రాంగణంలో కల శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నాగుల చవితి సందర్భంగా అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు టి ఎల్ ఎన్ ఆచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు అలంకారాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వా రి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోని పుట్ట వద్ద మహిళలు పాలు పోసి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వి.ఎస్.పి జేఎల్ఎం ఇన్చార్జ్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.
రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా