బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్‌ను కలిసిన జగ్గయ్యపేట బీసీవై పార్టీ నాయకులు
బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్‌ను కలిసిన జగ్గయ్యపేట బీసీవై పార్టీ నాయకులు
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ : భారత చైతన్య యువజన పార్టీ (BCY) జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ని జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన బీసీవై పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు
ఇటీవల జరిగిన జగ్గయ్యపేట పట్టణ మున్సిపల్ చైర్మన్ మరియు జగ్గయ్యపేట మండల జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీవై పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను తుమాటి శివలీల, గుమ్మా చంద్రశేఖర్ ను బోడె రామచంద్ర యాదవ్ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేయకుండా, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఎన్నికల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు
బీసీవై పార్టీ ఎన్నికల బరిలోకి దిగడంతోనే ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆందోళన, భయం ప్రారంభమైందని, ప్రజలు ప్రస్తుత రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో బీసీవై పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు
అలాగే త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీసీవై పార్టీ బలపరిచిన అభ్యర్థులను పోటీకి నిలబెట్టేందుకు పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో బీసీవై పార్టీ విజయానికి, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు పచ్చిపాల నాగేశ్వరరావు యాదవ్, సత్య శేఖర్, న్యాయవాది మెట్టెల ఆంజనేయులు ని బోడె రామచంద్ర యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు
జగ్గయ్యపేట నియోజకవర్గంలో బీసీవై పార్టీకి ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను మరింత పెంచుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత ఉత్సాహంతో పనిచేస్తామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.
రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా