వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి......... పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి. మురళీకృష్ణ
పొన్నూరు మేజర్ న్యూస్:- వైయస్సార్సీపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక ఇటికంపాడు రోడ్డులో ఉన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలపై ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ......రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత, బూత్ స్థాయి కమిటీల బలోపేతం, పార్టీ శ్రేణుల సమన్వయం, ఓటర్లకు చేరువయ్యే అంశాలపై కీలకంగా చర్చించారు. రానున్న ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు షేక్.నాజర్, ఆకుల వెంకటేశ్వరరావు, సైపుల్లా, డాక్టర్ రూత్ రాణి, వెంకటసుబ్బయ్య, సంజీవ్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్