BREAKING
నిత్యావసరాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు మాదకద్రవ్యాల నివారణకు యువత కృషి చేయాలి.. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లకు శిక్షణ నగర సంకీర్తనకు ఆధ్యాత్మిక మేలుకొలుపు ఓటర్ స్లిప్ ఉన్నా, లేకపోయినా సరే, 20 రకాల గుర్తింపు కార్డుల్లో మాత్రం ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* జనగణన రెండవ దశ ప్రక్రియ అత్యంత కీలకం ఘనంగా నాగుల చవితి జేఎన్‌టీయూఏలో పారిశ్రామిక పీహెచ్‌డీకి దరఖాస్తుల ఆహ్వానం.. ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలి.. కూలిపోయిన ఇండ్లు ను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం సింగరేణి ఉద్యోగం కోల్పోయి మనస్తాపం.. వ్యక్తి ఆత్మహత్య రత్నాపూర్‌లో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం హామీలు అమలు చేయకుండా తెలంగాణకు వచ్చే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు : హేమా సుదర్శన్ యూత్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత బాక్సర్లు.. రెండు స్వర్ణాలతో అదరగొట్టిన అంబేకర్, గుంజన్ మహిళా సంఘాల బలోపేతానికి వీవో భవనం దోహదం ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన వివాన్ కపూర్.. 2028 ఒలింపిక్స్ కోటా కైవసం

మురసు తుపాను తీవ్రమైన నష్టాన్ని మిగిల్చిందని అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం నాయకులు, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్

Select Suryaa Now
మురసు తుపాను తీవ్రమైన నష్టాన్ని మిగిల్చిందని అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం నాయకులు, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి  చిత్తరంజన్ దాస్

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

  మురసు తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నియమితులైన కేంద్ర బృందం శుక్రవారం జిల్లాకు చేరుకుంది. జిల్లాకు చేరుకున్న కేంద్ర బృందం సభ్యులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, మొక్కలను అందించి ఘనంగా ఆహ్వానం పలికారు. తుపానుతో జిల్లాలో అపార నష్టం వాటిల్లిన దృశ్యాలపై స్థానిక కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర బృందం పరిశీలించింది. తుపాను ప్రభావంతో జిల్లాకు వాటిల్లిన నష్టం అంచనాలను పి పి టి ద్వారా  కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ వివరించారు. తదుపరి నష్టం అంచనాలపై రూపొందించిన నివేదికను కేంద్ర బృందం సభ్యులకు కలెక్టర్ అందజేశారు.
        
       వ్యవసాయ, ఆక్వా రంగాలకు, విద్యుత్తు, రహదారుల వ్యవస్థకు అపార నష్టం సంభవించడంతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారని అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం నాయకులు చిత్తరంజన్ దాస్ అన్నారు. తుపాను జన జీవనాన్ని దెబ్బ తీసిందన్నారు. నష్టం అంచనాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ పరిశీలించిన అంశాలను కేంద్రానికి వివరిస్తామన్నారు. ఆర్ టి జి ఎస్  వ్యవస్థ ద్వారా, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని కలెక్టర్ సమయస్పూర్తితో వ్యవహరించారన్నారు. బాపట్ల జిల్లాపై తుపాను విరుచుకు పడినప్పటికీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని భారీగా నివారించగలిగారన్నారు. లోతట్టు ప్రాంతాలలో నిరాశ్రయులైన వందలాది కుటుంబాలను ఆదుకుని పునరావాసం కల్పించడం అభినందనీయమన్నారు. తుపాను నష్టంపై క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకోడానికి ప్రభుత్వ యంత్రాంగం పక్కాగా సర్వే నిర్వహించిందన్నారు. 
        
       మురసు తుపానుతో బాపట్ల జిల్లా అపార నష్టానికి గురైందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. 15 మండలాలు తుపాను ప్రభావానికి గురి కాగా, అందులో 9 మండలాలు బాగా దెబ్బతిన్నాయన్నారు. మార్టూరు మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, పర్చూరు, బాపట్ల, కారంచేడు మండలాలలో 21 గ్రామాలు నీట మునిగాయన్నారు.  ముగ్గురు వ్యక్తులు మరణించగా, 28 జీవాలు మృతి చెందాయన్నారు. 1,470 గృహాలు నీట మునిగాయన్నారు. 153 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నిరాశ్రయులైన 11,507 మందికి ఆశ్రయంతో పాటు భోజన వసతి కల్పించామన్నారు.
       
      మురసు తుపానుతో బాపట్ల జిల్లాకు రూ.320.49 కోట్లు నష్టం వాటిల్లిందని కలెక్టర్ కేంద్ర బృందానికి వివరించారు. తుపానుతో 10,789 మందికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. 4,129.42 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని, రైతులకు సంబంధించిన 6,251 ట్రాక్టర్లు దెబ్బతినగా వాటి విలువ మొత్తం రూ.9.89 కోట్లు ఉంటుందన్నారు. 140.608 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినగా వాటి విలువ రూ.45.438 లక్షలుగా అంచనా వేశామన్నారు. 302 బోట్లు, వలలు దెబ్బతినగా రూ.28.10 లక్షలు నష్టం వాటిల్లిందన్నారు. జీవనోపాధి కోల్పోయిన 13,214 మందికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశామన్నారు.  ప్రధానంగా 331.92 కిలోమీటర్ల మేర 94 ఆర్ అండ్ బి రహదారులు, 20 బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని, వాటి నష్టం రూ.204.86 కోట్లుగా గుర్తించామన్నారు. ప్రధానమైన నల్లమడ, ఓగేరు వాగు, నక్క వాగు, పర్చూరు వాగు, ఆలేరు కాల్వలతోపాటు, 259 కాల్వలు దెబ్బతిన్నాయని, వాటికి రూ.55.44 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. 33 కెవి  స్తంభాలు-698, విద్యుత్ లైన్ లు 33.77 సీకేఎం దెబ్బతిన్నాయని, 11 కెవి స్తంభాలు-3,443, అలాగే విద్యుత్తు లైన్ లు 102.9 సీకేఎం, ఎల్ టి స్తంభాలు 2,064, విద్యుత్ లైన్ లు 165.54 దెబ్బతిన్నాయన్నారు. 141 సౌర విద్యుత్ పలకలు దెబ్బతినగా మొత్తంగా విద్యుత్ శాఖకు రూ.22.39 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. 6,647 నివాసగృహాలు దెబ్బతిన్నగా వాటి విలువ రూ.7.98 కోట్లు అంచనా వేశామన్నారు. పంచాయతీరాజ్ రహదారులకు రూ.10.41 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. బాపట్ల, రేపల్లె, చీరాల మున్సిపాలిటీలలో కాల్వలు, రహదారులు దెబ్బతినగా, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు రూ.3.11 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. వివిధ రంగాలలో జరిగిన నష్టాలను కేంద్ర బృందానికి వివరించారు.
        
      ఈ సమావేశంలో కేంద్ర బృందం సభ్యులు వ్యవసాయం, రైతు సంక్షేమశాఖ అదనపు అభివృద్ధి కమిషనర్ ప్రశాంత్ ఆర్మోరికర్, కేంద్ర ఆర్థిక, వ్యయ మంత్రిత్వశాఖ సహాయ సంచాలకులు హిమాలయ గార్గ్, విద్యుత్ మంత్రిత్వశాఖ, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ఉప సంచాలకులు ప్రణయ్ గర్గ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.