BREAKING
హామీలు అమలు చేయకుండా తెలంగాణకు వచ్చే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు : హేమా సుదర్శన్ యూత్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత బాక్సర్లు.. రెండు స్వర్ణాలతో అదరగొట్టిన అంబేకర్, గుంజన్ మహిళా సంఘాల బలోపేతానికి వీవో భవనం దోహదం ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన వివాన్ కపూర్.. 2028 ఒలింపిక్స్ కోటా కైవసం జపాన్ ఓపెన్ టోర్నీలో క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ కొమ్మూరు కెనాల్ మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో తెలుగు బ్లాక్‌హాక్స్‌ అంచనాలు.. విజయవాడ వేదికగా సన్నాహాలు అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతం.. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా రేపటి నుండి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : జయప్రదం చేయాలని గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ పిలుపు సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్లే పాటలు చిరకాలం నిలవవు.. అను మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు రైతులను నిండా ముంచుతున్న కొనుగోలు కేంద్రాలు! కలెక్టరేట్ ముట్టడిస్తామని రసమయి బాలకిషన్ హెచ్చరిక సంగీత దర్శకుడు అనిరుధ్ పెళ్లి వేడుకల్లో హాట్‌టాపిక్‌గా మారిన ధనుష్ ఆహ్వానం భారతదేశాన్ని ఒక్కచోట చూడాలంటే అది ఏపీలోనే సాధ్యం. నటుడు గోవిందాతో కలిసి నటి రాణి రోమాంటిక్ ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్ నేడు వెల్దుర్తి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

రవిప్రకాష్‌కు కీర్తి పురస్కారం

Select Suryaa Now
రవిప్రకాష్‌కు  కీర్తి పురస్కారం



మహేశ్వరం, మేజర్ న్యూస్: తుమ్మలూరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న సంబరాజు రవిప్రకాష్ తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విశేష ప్రతిభ కనబరుస్తూ ప్రముఖ కవి, రచయితగా మంచి గుర్తింపు సాధించారు. ఆయన చేసిన విశిష్ట సాహితీ కృషిని గుర్తించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జీవిత చరిత్ర విభాగంలో కీర్తి పురస్కారం లభించింది. ఈ పురస్కారం ప్రకటించడం పట్ల ఎంఈవో కాస్నా నాయక్, తుమ్మలూరు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.  శుక్ర వారం తుమ్మలూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రవి ప్రకాష్ ను ఘనంగా సన్మానించారు.సంబరాజు రవిప్రకాష్ తెలకపల్లి రామచంద్రశాస్త్రి, కేశవపంతుల జీవిత చరిత్రలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకథలు, జీవిత చరిత్రలు, సంబరాజు శతకం తదితర రచనలు చేశారు. అలాగే, వేముగంటి నరసింహాచార్యులు రచించిన తిక్కన కావ్యానికి, వానమామలై వరదాచార్యులు రచించిన రామాయణానికి వ్యాఖ్యానాలు రాశారు. గతంలో విశిష్ట కళారత్న, సాహితీ ప్రియ పురస్కారాలు కూడా అందుకున్నారు.
కవిగా, రచయితగా తెలుగు సాహిత్య రంగంలో రాష్ట్రస్థాయి గుర్తింపు పొందడంతో పాటు, తుమ్మలూరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తున్న  సంబరాజు రవిప్రకాష్‌కు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం లభించడం మన గ్రామానికి గర్వకారణమని గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏంఈవో కాస్నా నాయక్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మాజీ పాఠశాల చైర్మన్ మైబు, పూర్వ విద్యార్థి యాదగిరి తదితరులు సంబరాజు రవిప్రకాష్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు.


పాల జనార్ధన్, మేజర్ న్యూస్ మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా