BREAKING
నేడు వెల్దుర్తి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం షిరిడీ సాయి సన్నిధిలో మెగా హీరో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు వైసీపీకి గుడ్‌బై.. టీడీపీలోకి 26 కుటుంబాలు! ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? చంద్రయాన్ సినిమా రివ్యూ గ్రంథాలయ వారోత్సవాలను జయప్రదం చేయండి 40 ఏళ్లుగా రోడ్డు నిర్మాణం ఊసేలేదు : హేమా సుదర్శన్ అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నగరం కళాశాలకు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు కనీస వేతనం 26వేలకు పెంచాలి మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు మురసు తుపాను తీవ్రమైన నష్టాన్ని మిగిల్చిందని అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం నాయకులు, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు బాన్సువాడ విద్యార్థిని ఎంపిక నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు సంసిద్ క్యాంఫర్డ్ ఒలింపియాడ్ క్యాంపస్‌లో బాలల దినోత్సవ సంబురాలు – ఫ్యాన్సీ డ్రెస్ పోటీలతో చిన్నారుల సందడి.” ఆర్ట్ ఫెస్టివల్‌లో ప్రతిభ చాటిన చెంచు విద్యార్థులు విద్యతో పాటు కళల్లోనూ రాణించాలి లింగాల హై స్కూల్ ఇంచార్జ్ హెచ్ఎం కొండయ్య

సీఐఐ సదస్సు ప్రాంగణంలో ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ ను వీక్షించిన మంత్రి లోకేష్

Select Suryaa Now
సీఐఐ సదస్సు ప్రాంగణంలో ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ ను వీక్షించిన మంత్రి లోకేష్

విశాఖపట్నం, మేజర్‌న్యూస్‌ :

 రాష్ట్రంలో పెద్ద పరిశ్రమల స్థాపనతో పాటు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రజాప్రభుత్వం చర్యలు చేపడుతుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా రెండో రోజు సదస్సు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ ను మంత్రి వీక్షించారు. ఆయా పరిశ్రమల ఉత్పత్తులు, పరికరాలు, నూతన ఆవిష్కరణలను మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. ప్రెసిషన్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, మెటీరియల్ అండ్ మొబిలిటీ సొల్యూషన్స్, ఆర్టీఐహెచ్ ఇన్నోవేటర్స్ ఏరీనా, అగ్రి-టెక్ అండ్ సర్క్యులర్ ఎకానమీ, ఎస్ హెచ్ జీ అండ్ ఉమెన్-లెడ్ ఎంటర్ ప్రైజ్డ్, ఫార్మా అండ్ మెడ్ టెక్, ఫుడ్ ప్రాసెసింగ్ స్టాళ్లను సందర్శించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిర్మిక్ ఇన్సులేటర్స్, స్టేషన్ హైడ్రాలిక్ పవర్ ప్యాక్, ఎడ్యుకేషనల్ రోబోట్, కండక్టివ్ గ్యాస్ కెట్స్ , వేవ్ గైడ్స్, క్వాంటం కంప్యూటింగ్ కాంపోనెంట్స్, మిసైల్ ఎజెక్షన్ మెకానిజం, ప్యాకింగ్ ఐటెమ్స్, ఏసీపీ షీట్స్, లిథియం బ్యాటరీస్, లీబాంగ్ వాటర్ ఫ్రూఫింగ్ ఉత్పత్తులు, వాయిస్ కమాండ్ ద్వారా పనిచేసే ఏఐ డ్రోన్, హెల్మెట్ శానిటైజింగ్ మెషిన్ వంటి పలు నూతన ఆవిష్కరణలను మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. ఆయా ఆవిష్కరణలు, ఉత్పత్తులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేస్తాం

అనంతరం ఔత్సాహిక ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. వారి ఆవిష్కరణలు, ఆదాయం, కల్పించిన ఉద్యోగాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామన్నారు. మీరంతా సొంతకాళ్లపై నిలబడ్డారని, ఇది ఎంతో గర్వకారణమని ప్రశంసించారు. మీరంతా ఎకో సిస్టమ్ క్రియేటర్స్. అభివృద్ధి చెందిన దేశాలను గమనిస్తే.. ఎకో సిస్టమ్ కీలకపాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో కూడా ఎకోసిస్టమ్ అభివృద్ధికి కృషిచేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ చెప్పారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కే.రామ్మోహన్ నాయుడు, ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.