డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
కందుకూరు, మేజర్ న్యూస్: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని స్థానిక ఎస్‌ఐ చందర్ సింగ్, ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్ రవికుమార్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు ఊటు మహేందర్ పిలుపునిచ్చారు.
శుక్రవారం మై భారత్ మహేశ్వరం–కందుకూరు బ్లాక్ వాలంటీర్ తిక్కల మణికుమార్ ఆధ్వర్యంలో కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం, యూత్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. డ్రగ్స్‌కు బానిసైన వారిని నిందించకుండా అవగాహన, కౌన్సెలింగ్, చికిత్స ద్వారా సాధారణ జీవితంలోకి తీసుకురావాలని సూచించారు.
డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. నశా ముక్త్ భారత్–డ్రగ్ ఫ్రీ భారత్ లక్ష్య సాధనకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువజన సంఘాలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మంగరాజు, యువజన సంఘాల నాయకులు ఢిల్లీ అనిల్, రాఘవేందర్, అమరేందర్, వినయ్, నందు, సాయి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
టి శ్రీనివాస్, మేజర్ న్యూస్,కందుకూరు, రంగారెడ్డి జిల్లా.