BREAKING
అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతం.. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా రేపటి నుండి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : జయప్రదం చేయాలని గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ పిలుపు సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్లే పాటలు చిరకాలం నిలవవు.. అను మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు రైతులను నిండా ముంచుతున్న కొనుగోలు కేంద్రాలు! కలెక్టరేట్ ముట్టడిస్తామని రసమయి బాలకిషన్ హెచ్చరిక సంగీత దర్శకుడు అనిరుధ్ పెళ్లి వేడుకల్లో హాట్‌టాపిక్‌గా మారిన ధనుష్ ఆహ్వానం భారతదేశాన్ని ఒక్కచోట చూడాలంటే అది ఏపీలోనే సాధ్యం. నటుడు గోవిందాతో కలిసి నటి రాణి రోమాంటిక్ ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్ నేడు వెల్దుర్తి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం షిరిడీ సాయి సన్నిధిలో మెగా హీరో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు వైసీపీకి గుడ్‌బై.. టీడీపీలోకి 26 కుటుంబాలు! ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? చంద్రయాన్ సినిమా రివ్యూ గ్రంథాలయ వారోత్సవాలను జయప్రదం చేయండి 40 ఏళ్లుగా రోడ్డు నిర్మాణం ఊసేలేదు : హేమా సుదర్శన్ అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నగరం కళాశాలకు ఓవరాల్ ఛాంపియన్‌షిప్

ఎల్‌నినోపై విద్యార్థుల ర్యాలీ

Select Suryaa Now
ఎల్‌నినోపై విద్యార్థుల ర్యాలీ

నవాబుపేట సూర్య న్యూస్: ఎల్‌నినో ప్రభావం,దాని వల్ల కలిగే వాతావరణ మార్పులు,వ్యవసాయంపై పడే ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మండల కేంద్రంలోని న్యూ చాణిక్య టాలెంట్ పాఠశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా శుక్రవారం విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు.మండల కేంద్రంలోని పాత బస్టాండ్ చౌరస్తా,హనుమాన్ ఆలయ ప్రాంగణం,మండల పరిషత్ కార్యాలయం వద్ద విద్యార్థులు విభిన్న వేషధారణలు,ప్రదర్శన పలకలతో ఎల్‌నినో ప్రభావాలను కళ్లకు కట్టినట్లు వివరించారు.అంతేకాకుండా ఎల్‌నినో కారణంగా ఏర్పడే వాతావరణ మార్పులు,వర్షాభావ పరిస్థితులు,వ్యవసాయంపై పడే ప్రభావాలను వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన ప్రత్యేక నాటికలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.నాటికల ద్వారా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చక్కగా వివరించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో జయరాం నాయక్,ఎంఈవో నాగ్య నాయక్,డిప్యూటీ తహసీల్దార్ సువర్ణ మాట్లాడుతూ..న్యూ చాణిక్య టాలెంట్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు.రైతులు,గ్రామీణ ప్రజలకు ముందస్తు అవగాహన కల్పించేలా విద్యార్థులు వేషధారణలు,నాటికలతో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం ఆదర్శనీయమని కొనియాడారు.విద్యార్థుల ప్రతిభను అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు సునీల్ పాటిల్,సందీప్ పాటిల్,నాయకులు,ఉపాధ్యాయ బృందం,విద్యార్థుల తల్లిదండ్రులు,మండల ప్రజలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.