*నారాయణ బెస్ట్ ఫౌండేషన్ స్కూల్ లో ఘనంగా బాలోత్సవ వేడుకలు..*
*ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు*
మధిర సూర్య మేజర్ న్యూస్
బాలలు భావి భారతావని స్వప్నాలని నారాయణ బెస్ట్ ఫౌండేషన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ బోనగిరి నారాయణరావు అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నేటి బాలలే రేపటి పౌరులంటూ విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. సమాజంలోని చెడుకు పిల్లలు దూరంగా ఉండాలని అందుకు తల్లిదండ్రుల పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలని తెలిపారు. నేటి సమాజంలో విద్యార్థులను చెడు మార్గం వైపు ఉసిగొల్పుతున్న మొబైల్ ఫోన్స్కు దూరంగా విద్యార్థులు ఉండాలని తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించారు. పాఠశాల ఆవరణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.