బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపికి తుఫాన్ ముప్పు!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపికి తుఫాన్ ముప్పు!
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. రానున్న 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 15వ తేదీ నాటికి వాయుగుండంగా మారి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో 16వ తేదీ వరకు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.