BREAKING
పామూరు అభివృద్ధికి ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించండి శ్రీ జ్ఞాన జ్యోతి లో అంబరాన్నంటిన బాలల దినోత్సవ వేడుకలు.. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా బాపట్ల కలెక్టరేట్‌లో అవగాహన కార్యక్రమ బ్యానర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ మెటాకు భారీ షాక్..ఇటలీలో దాదాపు 90 కోట్ల యూరోల జరిమానా విధింపు బాపట్ల కలెక్టరేట్‌లో SAANS కార్యక్రమ బ్యానర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నటనకు గుడ్‌బై చెప్పడం లేదు.. వస్తున్న పుకార్లపై మాస్టర్ భరత్ స్పష్టత! అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి - గ్లోబల్ ఆర్థిక పోకడలపై నిపుణుల విశ్లేషణ కృత్రిమ మేధస్సు యుగంలో లోహాల డిమాండ్ బోడవాడ ,మండగుంట గ్రామం నందు నామినేషన్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి ఆర్ఎంపి పిఎంపి మండల అధ్యక్షునిగా షాదుల్లా హుస్సేన్ నూతన పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటు ఆయుధం - రవి ముదిరాజ్ బోదేపల్లి అంగన్వాడీ కేంద్రంలో జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు 'బేర్‌ఫుట్ బాసెస్' విషయంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి స్వర్ణ పర్చూరు -1 కేంద్రంలో నామినేషన్లు స్వీకరించే కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి

రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి:ప్రకాశం జిల్లా పోలీసులు

Select Suryaa Now
రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి:ప్రకాశం జిల్లా పోలీసులు

సూర్య స్టేట్ బ్యూరో.

విద్యార్థుల రవాణా భద్రతతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు ట్రాఫిక్ సీఐ సి.హెచ్. హజారత్తయ్య ఒంగోలు టౌన్లోని ఎం.ఎం. రోడ్ జంక్షన్ సమీపంలో ఉన్న హర్షిణి కళాశాల ప్రాంగణంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సు డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించి రోడ్డు భద్రత, విద్యార్థుల రక్షణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రతి బస్సు డ్రైవర్ తప్పనిసరిగా యూనిఫాం ధరించడంతో పాటు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదని సూచించారు. ప్రతి బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఎమర్జెన్సీ కిటికీ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, బస్సులను నిర్దేశిత వేగ పరిమితిలోనే నడపాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులు బస్సులోకి ఎక్కిన తర్వాత డోర్లు పూర్తిగా మూసివేయాలని, వారు బస్సు ఎక్కే సమయంలో, దిగే సమయంలో స్కూలు/కళాశాలకు సంబంధించిన వారు  దగ్గర నుండి పర్యవేక్షించాలని తెలిపారు. అదేవిధంగా బస్సులను రహదారికి ఒకవైపు సురక్షితంగా నిలిపి విద్యార్థులను ఎక్కించుకోవాలని, దించుకోవాలని, రోడ్డు మధ్యలో బస్సులను నిలపరాదని సూచించారు. విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో డ్రైవర్/ క్లీనర్ లేదా అటెండర్ దగ్గరుండి సురక్షితంగా రోడ్డు దాటించాలని, ప్రయాణ సమయంలో విద్యార్థులు చేతులు, తలలను బస్సు కిటికీల నుంచి బయటకు పెట్టకుండా డ్రైవర్లు అప్రమత్తంగా పర్యవేక్షించాలని తెలిపారు. రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘించే స్కూల్, కళాశాల బస్సులపై మోటారు వాహనాల చట్టం (MV Act) ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు విధిస్తామని, అవసరమైతే బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రతి బస్సు డ్రైవర్ లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి సహకరించాలని తెలియజేశారు. స్కూల్, కళాశాలల యాజమాన్యాలు తమ బస్సులు ప్రభుత్వ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలి. బస్సులకు అవసరమైన అన్ని అనుమతులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలి. అర్హత కలిగిన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలి. విద్యార్థుల సురక్షిత ప్రయాణం పట్ల యాజమాన్యాలు పూర్తి బాధ్యత వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ కోటయ్య, శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.