BREAKING
మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు మురసు తుపాను తీవ్రమైన నష్టాన్ని మిగిల్చిందని అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం నాయకులు, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు బాన్సువాడ విద్యార్థిని ఎంపిక నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు సంసిద్ క్యాంఫర్డ్ ఒలింపియాడ్ క్యాంపస్‌లో బాలల దినోత్సవ సంబురాలు – ఫ్యాన్సీ డ్రెస్ పోటీలతో చిన్నారుల సందడి.” ఆర్ట్ ఫెస్టివల్‌లో ప్రతిభ చాటిన చెంచు విద్యార్థులు విద్యతో పాటు కళల్లోనూ రాణించాలి లింగాల హై స్కూల్ ఇంచార్జ్ హెచ్ఎం కొండయ్య బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్‌ను కలిసిన జగ్గయ్యపేట బీసీవై పార్టీ నాయకులు మార్టూరులో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని వెనుక నుంచి ఢీకొన్న పల్సర్ బైక్.. ఇద్దరు యువకులు మృతి కానిస్టేబుల్ శ్రీను కుటుంబానికి అండగా ఉంటాం : కేఎల్ఆర్ సంగోజివాడి, వంకాయపల్లి శివార్లలో భూముల రీ-సర్వేపై అవగాహన సదస్సు వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి......... పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి. మురళీకృష్ణ రవిప్రకాష్‌కు కీర్తి పురస్కారం స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన కేఎల్ఆర్ మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఉద్యాన పంటలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం గ్రామసభలో విద్యార్థుల గళం

హైడ్రాపై కేటీఆర్‌ది తప్పుడు ప్రచారంః టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Select Suryaa Now
  హైడ్రాపై కేటీఆర్‌ది తప్పుడు ప్రచారంః  టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌ మాట్లాడే ముందు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి, దళితుడిని ఉప ముఖ్యమంత్రిగా నియమించిన కొద్దికాలానికే రాత్రికి రాత్రే పదవి నుంచి తొలగించిన చరిత్ర బీఆర్ఎస్‌దేనని విమర్శించారు. హైడ్రా పేరుతో ఇళ్ల కూల్చివేతలు జరుగుతున్నాయంటూ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఒక్క ఇల్లు కూల్చినట్లు నిరూపించినా చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. బీఆర్ఎస్‌కు ప్రజాదరణ క్రమంగా తగ్గిపోతోందనడానికి ఇటీవల నిర్మల్‌లో జరిగిన సభే నిదర్శనమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్ విజయాన్ని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు రాజకీయ విమర్శలకు దిగుతున్నారని, సమ్మిట్‌పై వారు చేస్తున్న ఆరోపణలు అసూయతో కూడుకున్నవని అన్నారు. మరోవైపు, మోదీ ప్రభుత్వం జర్నలిస్టుల వీసాలను రద్దు చేయడం ప్రపంచవ్యాప్తంగా ఖండించాల్సిన అంశమని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. జర్నలిస్టుల వీసాల రద్దును ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా ప్రతినిధులు ఖండించాలని పిలుపునిచ్చారు.
ఎ.రవీందర్‌: హైదరాబాద్‌.