వైసీపీకి మరో భారీ షాక్.. టీడీపీలోకి పిట్టకాయగుళ్ల మాజీ సర్పంచ్
సూర్య స్టేట్ బ్యూరో.
గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట మండలం పిట్టకాయగుళ్ల పంచాయతీలో వైసీపీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పిట్టకాయగుళ్ల మాజీ సర్పంచ్ నర్రా సత్యనారాయణ రెడ్డి తన అనుచరులతో కలిసి వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
నర్రా వెంకటేశ్వర రెడ్డి, నర్రా అంకిరెడ్డి, చేగిరెడ్డి పోతిరెడ్డి, కార్తీక్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నర్రా సత్యనారాయణ రెడ్డితో పాటు నర్రా వేణుగోపాల్ రెడ్డి, పెళ్లా రెడ్డి, ఆవుల అంకిరెడ్డి తదితరులకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి, వేయించి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని వారు తెలిపారు.