తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి నీటిని పొదుపు చేసుకోండి
అందోల్;మన్సిపాలిటీలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేకతలు తీసుకోవాలని ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ చైర్మన్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం మున్సిపాలిటీ కార్యాలయ సమావేశం మందిరంలో ఏర్పాటుచేసిన అత్యవసర సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.యల్ నినో ప్రభావముతో రానున్న డిసెంబరు నుంచి మిషన్ భగీరథ నీరు సరపరాకు సరిపడా నీరు లేనందున తీసుకోవలసిన చర్యలపై మరియు త్రాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు తీసుకోవలసిన ముందస్తు జగ్రతలపై తీసుకోవాలని ఆయన సూచించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రదేశంలో అవసరమైన చోట్ల బోర్లు వేసి నీటి ఇద్దరు తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.సానిటేషన్ నిర్వహించుటకు సరిపడా సానిటేషన్ సిబ్బంది లేనందున చెత్త ను సేకరించుటకు ప్రైవేటు వారికీ చెత్త సేకరణ చేసుకొనుటకు అనుమతి ఇస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పలు వార్డులలోని సమస్యలను మున్సిపాలిటీ చైర్మన్ దృష్టికి తీసుకురాగా రానున్న రోజుల్లో సమస్యలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ సి.హెచ్.తిరుపతి వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ, కౌన్సిల్ సభ్యులు, కో -ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.