సంగారెడ్డి టి ఆర్ ఏ అధ్యక్షుడిగా పుట్టి సాయిలు నియామకం
నిజాంపేట్;తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం హైదరాబాద్ తార్నాక కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశానికి రాష్ట్రంలో పలు జిల్లాల నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుమారు వందమంది హాజరయ్యారు ఈ సమావేశంలో క్రింది తీర్మానాలను ఏకీగ్రీవంగా చేయడం జరిగింది, 1) గ్రేటర్ హైదరాబాద్ లో జీవో ఎంఎస్ 168 ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది 2) జీవో 168 సమస్యపై ఈనెల 28న ప్రెస్ మీట్ లు పెట్టాలని 29 న జిహెచ్ఎంసి కమిషనర్లకు వినతి పత్రాలు సమర్పించాలని, నవంబర్ 3 న జిహెచ్ఎంసి ఆఫీస్ ల ముందు ధర్నా చేయాలని పిలుపునివ్వడం జరిగింది 3) ప్రతి సంవత్సరం లాగానే నూతన క్యాలెండర్----డైరీ ని తీసుకురావాలని డిసెంబర్ చివరి వారంలో హైదరాబాదులో సభ పెట్టి ఆవిష్కరణ చేయాలని తీర్మానం చేయడం జరిగింది 4) అన్ని జిల్లా స్థాయి సమావేశాలు పెట్టి కొత్త జిల్లా అధ్యక్షుల నియామకం చేయాలని డిసెంబర్ 10 లోపు ఈ సభలు సమావేశాలు నిర్వహించాలని తీర్మానం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగాబాచేపల్లి గ్రామానికి చెందిన పుట్టి. సాయిలు నూతనంగా నియమించటం జరిగింది, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా వనజను నియమిస్తూ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీకాంత్ రెడ్డిని నియమిస్తూ మరో తీర్మానం చేయడం జరిగింది, జిహెచ్ఎంసి కార్యాలయాల ముందు జరగబోవు ధర్నాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన పుట్టి సాయిలు ను బాచేపల్లి నాయకులు చరణ్ గౌడ్ సుదర్శన్ బాలు శేఖర్ సేటు తదితరులు సన్మానించారు