BREAKING
ప్రశాంతంగా చీరాల, వేటపాలెంలో ముగిసిన పోలింగ్ దర్శి లో వెళ్లివేసిన ఆధ్యాత్మికత శోభ. బిజెపి పార్టీ బలోపేతం కు సమిష్టిగా కృషి చెయ్యండి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ టీడీపీ - బీజేపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి వాతావరణ మార్పుల అనుకూల నిధుల్లో తీవ్ర అంతరం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన అబ్జర్వర్ అధికారికంగా చేరని ఓటర్ స్లిప్పులు అధికారులు, ఎస్ఈసీ మాఫియాలా మారారు.. పాలకొండ డిగ్రీ కళాశాలలో రిసెప్షన్ మరియు స్ట్రాంగ్ రూమ్ కేంద్రం తనిఖీ బంగాళాఖాతంలో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పరిశోధన నెట్‌వర్క్ ప్రారంభం ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీపీ అభ్యర్థి మోర్ల స్వరూపరాణి ఏపీలో తగ్గుముఖం పట్టిన 'మురసు' తుఫాను ప్రభావం భ‌విష్య‌త్ జ‌న‌సేన‌దే * ఎన్నిక‌లేదైనా కూట‌మిదే విజ‌యం * డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ విగ్రహావిష్కరణ.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఘన నివాళి

సిర్గాపూర్ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Select Suryaa Now
సిర్గాపూర్ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో  నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ...
మండల పరిధిలోని గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ పట్టాలను పంపిణీ చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఈ సమావేశంలో మండలానికి సంబంధించిన సర్పంచులు మండల ప్రజాప్రతినిధులు, ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు