BREAKING
దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మెట్రో రైలు వ్యవస్థ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ ను టెండర్లు తక్షణమే నిలిపివేయాలి రూ.1100 కోట్లకు పైగా విలువైన ఆస్తుల నగదీకరణకు అంతర మంత్రిత్వ శాఖ సిఫార్సు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు. ఘనంగా జనసేన విజయ కేతనం ర్యాలీ ప్రశాంతంగా చీరాల, వేటపాలెంలో ముగిసిన పోలింగ్ దర్శి లో వెళ్లివేసిన ఆధ్యాత్మికత శోభ. బిజెపి పార్టీ బలోపేతం కు సమిష్టిగా కృషి చెయ్యండి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ టీడీపీ - బీజేపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి వాతావరణ మార్పుల అనుకూల నిధుల్లో తీవ్ర అంతరం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన అబ్జర్వర్ అధికారికంగా చేరని ఓటర్ స్లిప్పులు అధికారులు, ఎస్ఈసీ మాఫియాలా మారారు.. పాలకొండ డిగ్రీ కళాశాలలో రిసెప్షన్ మరియు స్ట్రాంగ్ రూమ్ కేంద్రం తనిఖీ బంగాళాఖాతంలో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పరిశోధన నెట్‌వర్క్ ప్రారంభం

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ విగ్రహావిష్కరణ.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఘన నివాళి

Select Suryaa Now
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ విగ్రహావిష్కరణ.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఘన నివాళి

సూర్య జాతీయ డెస్క్ (న్యూఢిల్లీ): శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రసంగిస్తూ దేశ సార్వభౌమాధికారం, విద్యా రంగ అభివృద్ధిలో ఆయన వహించిన పాత్రను స్మరించుకున్నారు. దేశ విభజనకు లేదా ఐక్యతకు భంగం కలిగించేలా ఉన్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆయన ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు. దేశాన్ని విభజించే ధోరణి ఉన్న ప్రభుత్వంలో తాను కొనసాగలేనని చెప్పి మంత్రి పదవిని కూడా త్యజించిన గొప్ప సిద్ధాంతకర్త శ్యామా ప్రసాద్ అని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న దక్కించుకునే స్థాయి గౌరవం, ఆదరణ శ్యామా ప్రసాద్ ముఖర్జీ సొంతమని సీఎం రేఖా గుప్తా పేర్కొన్నారు. విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా ఆయన అందించిన సేవలు నేటి తరానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని వెల్లడించారు. విద్యార్థులు ఆయన జీవితం నుంచి జాతీయతా భావాన్ని, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

ఢిల్లీ వర్సిటీలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ మహిళా కళాశాల తమ 125వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించగా, విగ్రహావిష్కరణ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు మరియు ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ వేడుకలో ముఖర్జీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.