BREAKING
కిమ్ కర్దాషియన్ తన బ్యూటీ బ్రాండ్ ఆసక్తికరమైన కథ కర్నూలు జిల్లాలో రిగ్గింగ్ కలకలం: పోలింగ్ నిలిపివేసిన అధికారులు జేమ్స్ బాండ్ చిత్రాలలో తన పాత్ర మరణానికి డేనియల్ క్రెయిగ్ కారణమన్న జూడి డెంచ్ 'అవెంజర్స్: డూమ్స్‌డే' లో తన పాత్రకు జపనీస్ డబ్బింగ్ చెప్పే నటుడిని స్వయంగా ప్రకటించిన రాబర్ట్ డౌనీ జూనియర్ రంజీ ట్రోఫీ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన తమిళనాడు క్రికెటర్ అజిత్ రామ్ స్థానిక గెలుపు అసెంబ్లీకి సంకేతమా? టాలీవుడ్‌పై రాధికా ఆప్టే అనుచిత వ్యాఖ్యలు: నటి పాయల్ రాజ్‌పుత్ సంచలన కౌంటర్ ఎన్‌ఎఫ్‌ఎల్ కల చెదిరినా బాధపడట్లేదన్న డ్వేన్ జాన్సన్ సంక్షేమ పథకాల చెల్లింపుల్లో కేంద్రం కీలక నిర్ణయం: ఆధార్ బదులు ఓటర్ ఐడీ, బయోమెట్రిక్ ప్రాతిపదిక రామాయణాన్ని గ్లోబల్ వేదికపైకి తీసుకెళ్లడం డెబ్యూలోనే వరల్డ్ కప్ ఆడినట్లే: నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు రేణిగుంటలో పోలింగ్ సిబ్బందికి మధ్యాహ్నం 3 గంటలు గడుస్తున్న భోజనం కరువు బాలకృష్ణ దాదా సినిమా విడుదల వాయిదా వార్తలకు చెక్: క్రిస్మస్ బరిలోనే నిలవనున్న నటసింహం వరి కొయ్యలు కాల్చితే భూసారం నాశనం.. బయో డీసీతో కుళ్లిస్తే నేలకు సేంద్రియ సంపద – రైతులకు నూక సైదులు అన్నమయ్య జిల్లాలో …ఘర్షణ, బ్యాలెట్ బాక్స్‌లు ధ్వంసం వందేళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగించుకున్న వేకుల భాగ్యమ్మ

సంక్షేమ పథకాల చెల్లింపుల్లో కేంద్రం కీలక నిర్ణయం: ఆధార్ బదులు ఓటర్ ఐడీ, బయోమెట్రిక్ ప్రాతిపదిక

Select Suryaa Now
సంక్షేమ పథకాల చెల్లింపుల్లో కేంద్రం కీలక నిర్ణయం: ఆధార్ బదులు ఓటర్ ఐడీ, బయోమెట్రిక్ ప్రాతిపదిక
న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు మరియు నిధుల జమ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ (లలన్) సింగ్ వెల్లడించారు. ఇప్పటివరకు అమలులో ఉన్న ఆధార్ ఆధారిత చెల్లింపుల స్థానంలో ఇకపై ఓటర్ ఐడీ (EPIC) నంబర్, బయోమెట్రిక్ ధ్రువీకరణను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

అతి సులభంగా అందుబాటులోకి వస్తుండటంతో ఆధార్ కార్డుల పట్ల నిఘా లోపించి నకిలీ లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉందన్న కాంబినేషన్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. సంక్షేమ ఫలాల్లో పారదర్శకత పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఓటర్ ఐడీలోని EPIC నంబర్ మరియు ప్రత్యక్ష బయోమెట్రిక్ ఆధారంగానే నగదు బదిలీ (DBT) ప్రక్రియ కొనసాగుతుందని, ఈ నూతన విధానానికి సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.