BREAKING
ట్రంప్ ఎదురుదెబ్బ: భారత్, పాక్‌లపై ప్రభావం ఏమిటి? సనత్ నగర్‌లో మురికినీటి తిప్పలు: జలమండలి ఎండితో మర్రి శశిధర్ రెడ్డి భేటీ ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణం: డొనాల్డ్ ట్రంప్ ఉద్యోగులకు ఐఫోన్ 16 దీపావళి గిఫ్ట్: ఢిల్లీ కంపెనీ హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఇటలీ జంట భారతీయులపై విద్వేష వ్యాఖ్యలు: టెక్సాస్ ఎన్నికల్లో రిపబ్లికన్ నేత ఓటమి ఉమెన్స్ టీ20 ట్రోఫీ ఎలైట్ టోర్నమెంట్‌లో ఘన విజయంతో ముగిసిన హైదరాబాద్ జట్టు ప్రయాణం రెడ్ స్టేట్స్ ఎలా బ్లూగా మారాయి?: డెమొక్రాట్ల చారిత్రక విజయం దొంగ నా కొడుకు సినిమాలో క్యూట్ అండ్ బబ్లీ రోల్ చేశా.. హీరోయిన్ సుష్మితా శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు! నేడు గ్రామీణ పాఠశాలలకు సెలవు పండుగ పూట షాకిచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లో పసిడి, వెండి రేట్ల పూర్తి వివరాలు! రక్షిత ప్రాంతాల వెలుపల జీవవైవిధ్య పరిరక్షణకు కొత్త మార్గదర్శకాలు 2028 నాటికి 6,000 మీటర్ల లోతులోకి మానవసహిత సముద్ర ప్రయోగం నేపాల్ పర్యటనలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మంత్రి చిరాగ్ పాస్వాన్ చేతుల మీదుగా అప్‌గ్రేడ్ చేసిన వెబ్‌సైట్ ప్రారంభం

ఉద్యోగులకు ఐఫోన్ 16 దీపావళి గిఫ్ట్: ఢిల్లీ కంపెనీ

Select Suryaa Now
 ఉద్యోగులకు ఐఫోన్ 16 దీపావళి గిఫ్ట్: ఢిల్లీ కంపెనీ

సూర్య ట్రెండింగ్ డెస్క్, న్యూఢిల్లీ: దీపావళి పండుగ వచ్చిందంటే సాధారణంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు స్వీట్ బాక్సులు, డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లు లేదా గిఫ్ట్ వోచర్లు ఇవ్వడం ఆనవాయితీ. అయితే దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ ఆర్థిక సేవల సంస్థ మాత్రం తమ ఉద్యోగులకు కలలో కూడా ఊహించని బంపర్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. తమ సిబ్బందికి దీపావళి బహుమతిగా ఏకంగా సరికొత్త యాపిల్ ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్లను అందించి వారి మోములో ఆనందాన్ని నింపింది.  సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.  

ఢిల్లీలోని రోహిణి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ‘ఫైనాన్సర్‌సాబ్’  అనే సంస్థ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వేడుకల వీడియోను పంచుకుంది. ఆఫీసులోకి ఉద్యోగులు అడుగుపెట్టేసరికి, వారి కంప్యూటర్ టేబుళ్లపై ఆకర్షణీయమైన రిబ్బన్లతో అలంకరించిన సరికొత్త ఐఫోన్ 16 బాక్సులు సిద్ధంగా ఉంచారు. నలుపు, తెలుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో ఉన్న ఫోన్లను చూసి ఉద్యోగులు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు.  

"దీపావళి గిఫ్ట్‌లలో మాకు తిరుగులేదు"
“దీపావళి గిఫ్ట్‌ల విషయంలో ఫైనాన్సర్‌సాబ్ ఎప్పటికీ ఒరిజినల్ (OG).. మాకు పోటీయే లేదు.. ఇంతకీ మీకు ఏం గిఫ్ట్ వచ్చింది?” అంటూ సంస్థ ఈ పోస్టుకు క్యాప్షన్ జోడించింది. ఈ వీడియో కొద్ది గంటల్లోనే 30 లక్షలకు (3 మిలియన్లు) పైగా వ్యూస్‌ను సాధించి నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.  


నెటిజన్ల ఫన్నీ కామెంట్లు – 'జాబ్ ఎక్కడ అప్లై చేయాలి?'
ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదా కామెంట్లతో స్పందిస్తున్నారు. "మీ కంపెనీలో ఏమైనా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయా.. ఎక్కడ అప్లై చేయాలో చెప్పండి", "మా బాస్ మాకు కనీసం సోన్ పాపిడి బాక్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదు.. ఇక్కడ ఏకంగా ఐఫోన్ ఇచ్చారు" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

పండుగల వేళ ఉద్యోగుల కృషిని గుర్తించి వారిని ఇలా ఖరీదైన గిఫ్ట్‌లతో ప్రోత్సహించడం కార్పొరేట్ వర్క్ కల్చర్‌లో అద్భుతమైన మార్పని, ఇది ఉద్యోగుల పనితీరును మరింత మెరుగుపరుస్తుందని పలువురు ప్రశంసిస్తున్నారు.