andhrapradesh
కర్నూలు జిల్లాలో రిగ్గింగ్ కలకలం: పోలింగ్ నిలిపివేసిన అధికారులు
కర్నూలు:కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండ గ్రామంలో గురువారం పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆర్లబండలోని 2వ నంబర్ పోలింగ్ బూత్ వద్ద అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.
వైఎస్సార్‌సీపీ నాయకుల ఫిర్యాదు, ఇరువర్గాల మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి బూత్-2లో పోలింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు, స్థానిక నేతలు అక్రమంగా ఓట్లు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగడంతో కేంద్రం వద్ద రణరంగ వాతావరణం నెలకొంది.
విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని పోలింగ్ కేంద్రం పరిసరాల నుంచి పంపివేశారు. పోలింగ్ బూత్ వద్ద పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.