పోలింగ్ కేంద్రంలో 'తల్లికి వందనం' పోస్టర్లు.. అధికారుల తీరుపై విమర్శలు*
*కర్నూలు రూరల్:*
కర్నూలు రూరల్ మండలం దేవరపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 23/50 పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు 'తల్లికి వందనం' పోస్టర్లు ఉండడం కలకలం రేపుతోంది.
ఎన్నికల నిబంధనల మేరకు రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించిన పోస్టర్లను మూసివేయాల్సి ఉండగా, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.