andhrapradesh
తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆందోళన
తిరుపతి:తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని సాయినగర్ పోలింగ్ కేంద్రం వద్ద గురువారం భారీ స్థాయిలో దొంగ ఓట్ల కలకలం రేగింది. బయటి ప్రాంతాల నుంచి పదుల సంఖ్యలో మహిళలు, యువకులు వాహనాల్లో వచ్చి దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తుండగా వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానికులతో కలిసి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పోలింగ్ కేంద్రం సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న పలువురిని ప్రశ్నించడంతో దొంగ ఓటర్లు సమీపంలోని ఒక దుకాణంలోకి వెళ్లి దాక్కునే ప్రయత్నం చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని అక్కడి నుంచి పంపించివేశారు. ఈ ఘటనతో సాయినగర్ పోలింగ్ కేంద్రం వద్ద కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, ముందస్తు చర్యగా పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.