ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులుతీరిన ఓటర్లు
నందిగామ, మేజర్ న్యూస్: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో గురువారం నందిగామ మండలం మాగల్లు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులుతీరారు. ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములవుతూ యువత, మహిళలు, పురుషులు, వృద్ధులు, దివ్యాంగులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, నీడ, క్రమబద్ధమైన క్యూలైన్లు, అవసరమైన ఫర్నిచర్ వంటి సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధ ఓటర్ల సౌకర్యార్థం వీల్‌చైర్లు, సహాయక సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు ఎన్నికల అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, నందిగామ నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.