BREAKING
మిల్లర్ల సిండికేట్‌తో రైతులకు కష్టాలు! విద్యార్థి సంఘం నాయకులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, తాళ్లగురిజాల పీహెచ్‌సీలో తనిఖీలు బీహార్‌లో ఎన్‌కౌంటర్: దానాపూర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత బీఎంసీ ఉద్యోగులకు కొత్త ఇళ్ల తాళాలు అందజేత తమిళ జాలర్ల మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం చైర్‌పర్సన్‌ రేసులో టిడిపి అభ్యర్థి హనీ స్పందన ఆధిక్యం కొండగట్టు అంజన్న సన్నిధిలో ‘బసవ’ చిత్ర బృందం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఇంటిగ్రేటెడ్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు 15 నుండి18 వరకు నల్గొండలో రైతు సంఘం జాతీయ మహాసభలు ఎన్నికల సరళి పై తలారి రంగయ్య విశ్లేషణ. ముగిసిన నిషేధ కాలం: ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు క్రిస్ లిన్ రీఎంట్రీ! ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన కివీస్ స్టార్ ఆటగాడు డెవాన్ కాన్వే: న్యూజిలాండ్‌కు భారీ షాక్!

ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేదా? ఫారం-6తో తిరిగి నమోదు చేసుకోవచ్చు!

Select Suryaa Now
ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేదా? ఫారం-6తో తిరిగి నమోదు చేసుకోవచ్చు!

సిద్దిపేట, : ముసాయిదా ఓటరు జాబితాలో పేరు గల్లంతైనప్పటికీ గతంలో ఓటరుగా నమోదైన అర్హత కలిగిన పౌరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తిరిగి ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. హైమావతి స్పష్టం చేశారు.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (సర్-2026)లో భాగంగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేని వారు తిరిగి తమ ఓటు హక్కును పొందేందుకు ఫారం-6 సమర్పించవచ్చని భారత ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు.అయితే ఫారం-6లో మొదటిసారి ఓటరుగా నమోదు చేసుకుంటున్నట్లు పేర్కొనాల్సి రావడంతో గతంలో ఓటరుగా నమోదైన వారు కొంత ఆందోళనకు గురవుతున్నారని, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 31 ప్రకారం తప్పుడు ప్రకటనచేసినట్లవుతుందేమోనని భయపడాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందన్నారు.వివిధ సాంకేతిక కారణాలు, ఓటరు జాబితా సవరణల కారణంగా ముసాయిదా జాబితాలో పేర్లు లేని అర్హులైన పౌరులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ఫారం-6 ద్వారా తిరిగి ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటరు జాబితాలో పారదర్శకత, విశ్వసనీయతను కాపాడటమే ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన పౌరులందరూ సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును తిరిగి పొందాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి విజ్ఞప్తి చేశారు.