యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి – మండల వ్యవసాయ అధికారి ఉమాపతి
సూర్య ఎలిగేడు
యాసంగి సీజన్‌లో తక్కువ నీటి వినియోగం కలిగిన ఆరుతడి పంటలు సాగు చేసి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఎం. ఉమాపతి రైతులకు సూచించారు. రాములపల్లి గ్రామంలో నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ఎండ తీవ్రత పెరిగి, బోర్లు, బావుల్లో నీటిమట్టాలు తగ్గే అవకాశం ఉందన్నారు. వరికి బదులుగా మొక్కజొన్న, వేరుశనగ, శనగ, పెసర, మినుము, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చన్నారు.సర్పంచ్ సిద్ధి తిరుపతి యాదవ్ మాట్లాడుతూ వి.బి.జి. రాంజీ పథకం ద్వారా ఫార్మ్ పాండ్లు, నీటి కుంటలను వినియోగించుకోవాలని, పశువులకు నీటి తొట్టెలు, పశుగ్రాసం అందుబాటులో ఉంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పొట్టాల రమేష్, ఏఈవోలు సురేష్, నరేష్, గణేష్, ఆయిల్‌పామ్ ఫీల్డ్ అధికారి అభిలాష్, రైతులు పాల్గొన్నారు.