కరువు పంట నష్టం నమోదు.. రైతులు వెంటనే స్పందించాలి
* నవంబర్ 9 చివరి గడువు: మండల వ్యవసాయ అధికారి కొర్ర రమేష్ నాయక్
ఉప్పునుంతల, సూర్య న్యూస్: కరువు నేపథ్యంలో ఉప్పునుంతల మండలంలో పంట నష్టం వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని నష్టపోయిన రైతులు నవంబర్ 9వ తేదీలోపు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి పంట పొలాలను పరిశీలన చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి కొర్ర రమేష్ నాయక్ సూచించారు. పంట వివరాలు డిజిటల్ క్రాప్ బుకింగ్‌లో నమోదై ఉండాలని, పరిశీలన సమయంలో పొలంలో పంట తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. గడువు ముగిసేలోపు రైతులందరూ పంట నష్టం వివరాలను నమోదు చేయించుకోవాలని కోరారు