BREAKING
గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న రెంటపల్లి శ్యామ్ వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. ప్రజలకు మెరుగైన సేవలందించాలి! జిల్లాలో ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి – మండల వ్యవసాయ అధికారి ఉమాపతి మెర్సిడెస్ GLC 400 ఎలక్ట్రిక్ SUV విడుదల గాజులమండ్యంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి గంగారి సుజాత ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేదా? ఫారం-6తో తిరిగి నమోదు చేసుకోవచ్చు! ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల వరద వేళ క్షేత్రంలోనే వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు..!**జలమయమైన పొలాలు, రోడ్లు, వార్డుల్లో పర్యటన.. తెగిన అంకమ్మ చెరువు కట్ట పరిశీలన* కుందుర్పిలో 90 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగం.. యువతకు ఆదర్శంగా వృద్ధురాలు మరుట్లలో రిగ్గింగ్ కలకలం: బ్యాలెట్ బాక్స్ ధ్వంసం కుందుర్పి మండలంలో తోపులాట.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత* పొదలకూరులో పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా కరువు పంట నష్టం నమోదు.. రైతులు వెంటనే స్పందించాలి కుందుర్పి మండలంలో 49.58 పోలింగ్

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

Select Suryaa Now
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మొత్తం 2,721 ఉపాధ్యాయ (డీఎస్సీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే మొత్తం 2,721 పోస్టులలో జనరల్ పాఠశాలలకు 2,111, ప్రత్యేక విద్య (స్పెషల్ ఎడ్యుకేషన్) విభాగంలో 350, అలాగే వివిధ సొసైటీ పాఠశాలలకు కేటాయించిన 260 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిర్వహించేందుకు పక్కా ప్రణాళికను వెల్లడించింది.

నవంబరు 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనుండగా, డిసెంబరు 20 నుంచి జనవరి 13 వరకు కంప్యూటర్ ఆధారిత విధానం (CBT)లో పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు డిసెంబరు 14 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, అలాగే ఈసారి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు కూడా రాతపరీక్ష నిబంధన వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు.