BREAKING
మిల్లర్ల సిండికేట్‌తో రైతులకు కష్టాలు! విద్యార్థి సంఘం నాయకులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, తాళ్లగురిజాల పీహెచ్‌సీలో తనిఖీలు బీహార్‌లో ఎన్‌కౌంటర్: దానాపూర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత బీఎంసీ ఉద్యోగులకు కొత్త ఇళ్ల తాళాలు అందజేత తమిళ జాలర్ల మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం చైర్‌పర్సన్‌ రేసులో టిడిపి అభ్యర్థి హనీ స్పందన ఆధిక్యం కొండగట్టు అంజన్న సన్నిధిలో ‘బసవ’ చిత్ర బృందం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఇంటిగ్రేటెడ్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు 15 నుండి18 వరకు నల్గొండలో రైతు సంఘం జాతీయ మహాసభలు ఎన్నికల సరళి పై తలారి రంగయ్య విశ్లేషణ. ముగిసిన నిషేధ కాలం: ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు క్రిస్ లిన్ రీఎంట్రీ! ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన కివీస్ స్టార్ ఆటగాడు డెవాన్ కాన్వే: న్యూజిలాండ్‌కు భారీ షాక్!

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. ప్రజలకు మెరుగైన సేవలందించాలి!

Select Suryaa Now
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. ప్రజలకు మెరుగైన సేవలందించాలి!

 

• తాండూర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్

సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. ప్రస్తుతం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) వైద్య సిబ్బంది ధర్నాలో ఉన్న నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలతో జాతీయ టీకాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, టీకాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

జాతీయ క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా టీబీ బాధితులను గుర్తించడం, నమోదు చేయడం, నిక్షయ్ పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్ చేయడం, బాధితులకు పౌష్టికాహార కిట్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాతా శిశు సంరక్షణలో భాగంగా గర్భిణుల నమోదు, ఆసుపత్రి ప్రసవాల ప్రోత్సాహం, అమ్మఒడి, అంబులెన్స్ సేవల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామపంచాయతీ సర్పంచులు, సిబ్బంది సహకారంతో పరిసరాల పరిశుభ్రతను పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై చైతన్యం తీసుకురావాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రోగులకు అవసరమైన వసతులు కల్పించాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలన్నింటినీ సమన్వయంతో అమలు చేస్తూ వందశాతం లక్ష్యాలను సాధించాలని, ఈ-ఔషధి కార్యక్రమంలో రోజువారీ రోగుల వివరాలు, మందుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. టెలీ మానస్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మానసిక ఆరోగ్యం, అసంక్రమిత వ్యాధులు, జీవనశైలి మార్పులతో వచ్చే వ్యాధుల నివారణపై చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ఉపకేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

 అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం, ఈ-ఔషధి, టెలీ మానస్ సేవలు, ల్యాబ్, మందుల రికార్డులు, ఆన్‌లైన్ రికార్డులను పరిశీలించి సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ఝాన్సీ, సీహెచ్‌ఓ జయ మేరీ, పర్యవేక్షకులు రమాదేవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజల్లో నిరంతరం అవగాహన కల్పించాలని జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు తెలిపారు.