BREAKING
గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న రెంటపల్లి శ్యామ్ వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. ప్రజలకు మెరుగైన సేవలందించాలి! జిల్లాలో ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి – మండల వ్యవసాయ అధికారి ఉమాపతి మెర్సిడెస్ GLC 400 ఎలక్ట్రిక్ SUV విడుదల గాజులమండ్యంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి గంగారి సుజాత ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేదా? ఫారం-6తో తిరిగి నమోదు చేసుకోవచ్చు! ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల వరద వేళ క్షేత్రంలోనే వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు..!**జలమయమైన పొలాలు, రోడ్లు, వార్డుల్లో పర్యటన.. తెగిన అంకమ్మ చెరువు కట్ట పరిశీలన* కుందుర్పిలో 90 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగం.. యువతకు ఆదర్శంగా వృద్ధురాలు మరుట్లలో రిగ్గింగ్ కలకలం: బ్యాలెట్ బాక్స్ ధ్వంసం కుందుర్పి మండలంలో తోపులాట.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత* పొదలకూరులో పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా కరువు పంట నష్టం నమోదు.. రైతులు వెంటనే స్పందించాలి కుందుర్పి మండలంలో 49.58 పోలింగ్

జిల్లాలో ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్

Select Suryaa Now
జిల్లాలో ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్

విజయవాడ, మేజర్ న్యూస్: ఎన్టీఆర్ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటల నుంచే జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా నున్న మండలం బోడపాడు ఆర్సీఎం పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. అధికారులను అడిగి ఓటింగ్ శాతాన్ని తెలుసుకున్నారు. ఓటర్లతో నేరుగా మాట్లాడి పోలింగ్ కేంద్రాల్లో కల్పించిన మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.

జిల్లావ్యాప్తంగా 992 పోలింగ్ కేంద్రాల్లో 5,200 మందికి పైగా సిబ్బందితో ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. వీటిలో 496 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీటీవీల ద్వారా కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేపట్టారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గ్రామాల అభివృద్ధిని కాంక్షిస్తూ దూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి ఓటు వేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి జిల్లాలో 40.64 శాతం పోలింగ్ నమోదైంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ సమయం ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు టోకెన్లు అందించి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ సజావుగా సాగేందుకు సహకరించాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజ్ఞప్తి చేశారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.