BREAKING
గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న రెంటపల్లి శ్యామ్ వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. ప్రజలకు మెరుగైన సేవలందించాలి! జిల్లాలో ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి – మండల వ్యవసాయ అధికారి ఉమాపతి మెర్సిడెస్ GLC 400 ఎలక్ట్రిక్ SUV విడుదల గాజులమండ్యంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి గంగారి సుజాత ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేదా? ఫారం-6తో తిరిగి నమోదు చేసుకోవచ్చు! ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల వరద వేళ క్షేత్రంలోనే వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు..!**జలమయమైన పొలాలు, రోడ్లు, వార్డుల్లో పర్యటన.. తెగిన అంకమ్మ చెరువు కట్ట పరిశీలన* కుందుర్పిలో 90 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగం.. యువతకు ఆదర్శంగా వృద్ధురాలు మరుట్లలో రిగ్గింగ్ కలకలం: బ్యాలెట్ బాక్స్ ధ్వంసం కుందుర్పి మండలంలో తోపులాట.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత* పొదలకూరులో పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా కరువు పంట నష్టం నమోదు.. రైతులు వెంటనే స్పందించాలి కుందుర్పి మండలంలో 49.58 పోలింగ్

మరుట్లలో రిగ్గింగ్ కలకలం: బ్యాలెట్ బాక్స్ ధ్వంసం

Select Suryaa Now
మరుట్లలో రిగ్గింగ్ కలకలం: బ్యాలెట్ బాక్స్ ధ్వంసం
అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితి నెలకొంది. గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో అధికార టీడీపీ నాయకులు భారీగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు, స్థానికులు తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామీణులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఒక్కసారిగా పోలింగ్ బూత్‌లోకి దూసుకెళ్లారు. అక్కడున్న బ్యాలెట్ బాక్స్‌ను బలవంతంగా బయటకు ఎత్తుకెళ్లి, రాళ్లతో కొట్టి బద్దలు కొట్టారు. అనంతరం అందులోని ఓటు వేసిన బ్యాలెట్ పేపర్లను చింపి వేసి బయట పారేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది.

విషయం తెలిసి పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన కూడేరు సీఐతో పాటు పోలీసు సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో అధికారులు పోలింగ్ ప్రక్రియను నిలిపివేసి, అదనపు బలగాలను రంగంలోకి దించారు.