BREAKING
ఉయ్యూరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి : నూతన చైర్మన్, కౌన్సిలర్లకు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ సూచన గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న రెంటపల్లి శ్యామ్ వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. ప్రజలకు మెరుగైన సేవలందించాలి! జిల్లాలో ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి – మండల వ్యవసాయ అధికారి ఉమాపతి మెర్సిడెస్ GLC 400 ఎలక్ట్రిక్ SUV విడుదల గాజులమండ్యంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి గంగారి సుజాత ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేదా? ఫారం-6తో తిరిగి నమోదు చేసుకోవచ్చు! ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల వరద వేళ క్షేత్రంలోనే వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు..!**జలమయమైన పొలాలు, రోడ్లు, వార్డుల్లో పర్యటన.. తెగిన అంకమ్మ చెరువు కట్ట పరిశీలన* కుందుర్పిలో 90 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగం.. యువతకు ఆదర్శంగా వృద్ధురాలు మరుట్లలో రిగ్గింగ్ కలకలం: బ్యాలెట్ బాక్స్ ధ్వంసం కుందుర్పి మండలంలో తోపులాట.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత* పొదలకూరులో పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా కరువు పంట నష్టం నమోదు.. రైతులు వెంటనే స్పందించాలి

గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న రెంటపల్లి శ్యామ్

Select Suryaa Now
గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న రెంటపల్లి శ్యామ్

ఇబ్రహీంపట్నం, మేజర్ న్యూస్: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు డైరెక్టర్, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెంటపల్లి శ్యామ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో సతీమణితో కలిసి ఓటు వేశారు.

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలికి గాయమై శస్త్రచికిత్స చేయించుకున్న శ్యామ్ ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, గాయాన్ని సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. స్థానిక సంస్థల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా సుస్థిర పాలనతో పాటు గ్రామాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లవచ్చన్నారు. ప్రతి ఓటరు విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.