BREAKING
స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి కాకాణి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవల సంఖ్య పెరిగింది నిర్మల్ పట్టణంలోని శాంతినగర్‌లో నూతనంగా నందన్ పాల కేంద్రం ప్రారంభం. : జిల్లాలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం :ఎస్పీ ఉమామహేశ్వర్ రేణిగుంటలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వరద ముంపులో అశ్వారావుపేట.. రెండ్లగూడ లో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం ఎల్లకొండలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మా పొలాలు తడపండి సారూ… అభివృద్ధికి నిధులు.. ఎమ్మెల్యేకు పాలాభిషేకం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారెడ్డి కుటుంబానికి బీజేపీ నాయకుల పరామర్శ ఓటర్లతో సందడిగా దేవాంగపురి పోలింగ్ కేంద్రాలు ఆరోగ్యకరమైన భూమే మన సంపద హృదయాన్ని కదిలించిన రక్తదానం..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవల సంఖ్య పెరిగింది

Select Suryaa Now
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవల సంఖ్య పెరిగింది

: ప్రభుత్వ విప్ శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

       మహబూబ్ నగర్ సూర్య ప్రతినిధి:

మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ‘యెన్నం హెల్త్ కిట్స్’ పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల పట్ల ప్రజల్లో నమ్మకం, ఆసక్తి పెరిగాయని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలకు నవజాత శిశువుల సంరక్షణకు అవసరమైన వివిధ వస్తువులతో కూడిన ‘యెన్నం హెల్త్ కిట్స్‌’ను ఆయన పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఏడాది నవంబర్ 14వ తేదీన తన సొంత నిధులతో ‘యెన్నం హెల్త్ కిట్స్‌’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను ప్రజలు మరింతగా వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.

           ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సైతం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా మెరుగైన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉండాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత విశ్వాసం కల్పిస్తూ, తల్లులు మరియు నవజాత శిశువులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీర, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.