రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారెడ్డి కుటుంబానికి బీజేపీ నాయకుల పరామర్శ
సూర్య వేల్పూరు వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన పాశపు చిన్నారెడ్డి (సన్నీ) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఎలేటి మల్లికార్జున్ రెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను కలిసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకొని, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల బీజేపీ అధ్యక్షులు, సర్పంచ్ బేల్దారి నవీన్, మోర్తాడ్ మండల బీజేపీ అధ్యక్షులు శివానందరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.