ఓటు హక్కును వినియోగించుకున్న మాలేపాటి భవాని
దగదర్తి, మేజర్ న్యూస్ : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో దగదర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దగదర్తి బిట్-1 ఎంపీటీసీ అభ్యర్థి, స్వర్గీయ మాలేపాటి సుబ్బానాయుడు సతీమణి మాలేపాటి భవాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, విద్యా కమిటీ సభ్యులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.