అభివృద్ధికి నిధులు.. ఎమ్మెల్యేకు పాలాభిషేకం
సూర్య తాడ్వాయి :తాడ్వాయి మండలం బ్రహ్మాజీ వాడి గ్రామానికి నాబార్డ్ సంస్థ ద్వారా ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించడం పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాల కల్పన, పాఠశాలల ఆధునీకరణే ధ్యేయంగా నాబార్డ్ ఈ నిధులను మంజూరు చేసింది. ఈ శుభపరిణామాన్ని పురస్కరించుకుని గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు గురువారం నాడు 22 లక్షల 10 వేలు నిధులు మంజూరు చేసినందుకుగాను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటానికి గ్రామస్తులు నాయకులు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి డాకూరి అంజనీ బాయ్ రఘుపతిరావు మాట్లాడుతూ.. "చాలా కాలంగా మా గ్రామంలో సరైన మౌలిక వసతులు, పాఠశాలలో ఆధునిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు నాబార్డ్ నిధులు మంజూరు కావడం వల్ల డిజిటల్ తరగతులు, తాగునీరు, గ్రంథాలయ వసతులు సమకూరనున్నాయి" అని ఆనందం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారి సంజీవులు, పిఎసిఎస్ చైర్మన్ సుధాకర్ రావు జూకంటి వెంకట్ రెడ్డి శ్యామరావు ఏం సి డైరెక్టర్ ప్రసాద్ రావు వీడీసీసీ మేకల రాజు దేవయిపల్లి సర్పంచ్ నరేష్ గదేరాజు ఉపసర్పంచ్ బీసీ సెల్ అధ్యక్షుడు అశోక్ రావు ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజు