BREAKING
ఎల్లకొండలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మా పొలాలు తడపండి సారూ… అభివృద్ధికి నిధులు.. ఎమ్మెల్యేకు పాలాభిషేకం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారెడ్డి కుటుంబానికి బీజేపీ నాయకుల పరామర్శ ఓటర్లతో సందడిగా దేవాంగపురి పోలింగ్ కేంద్రాలు ఆరోగ్యకరమైన భూమే మన సంపద హృదయాన్ని కదిలించిన రక్తదానం.. ప్రజ్ఞాభారతి పాటల పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థులకు ప్రథమ బహుమతి సీఎం సోదరుల అండదండలతోనే అక్రమాలు పోలింగ్ బూత్‌లను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ చాబోలు, వెంకటాపురం పోలింగ్ కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గ్రామాలభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయం. - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఓటు హక్కును వినియోగించుకున్న మాలేపాటి భవాని కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది – తన్నీరు నాగేశ్వరరావు కడవెరుగులో ఘనంగా హరే రామ హరే కృష్ణ నగర సంకీర్తన

సీఎం సోదరుల అండదండలతోనే అక్రమాలు

Select Suryaa Now
సీఎం సోదరుల అండదండలతోనే అక్రమాలు
హైదరాబాద్:హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీ భూముల్లో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లు, నిర్మాణాలపై బీఆర్‌ఎస్ (టీఆర్ఎస్) నేత కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి సోదరుల అండదండలతోనే ఇక్కడ అక్రమ దందాలు సాగుతున్నాయని ఆమె మండిపడ్డారు. వివాదాస్పద స్థలాల్లో ఇళ్లు కొనుగోలు చేసి సామాన్య ప్రజలు ఆర్థికంగా నష్టపోవద్దని ఈ సందర్భంగా ఆమె సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అయ్యప్ప సొసైటీ పరిధిలో దాదాపు 750 అక్రమ నిర్మాణాలు వెలిశాయని కవిత ఆరోపించారు. ఈ అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నెల రోజుల్లోగా సమగ్ర సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకించి సర్వే నంబర్లు 11/18 నుంచి 11/44 వరకు భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలు జరిగాయని, వాటిలో ప్రముఖ విద్యాసంస్థల భవనాలు కూడా ఉన్నాయని ఆమె వెల్లడించారు.

రాష్ట్రంలో టీడీఆర్ (TDR) అక్రమ దందాలు తప్ప ప్రభుత్వానికి వేరే ఏమీ కనిపించడం లేదని కవిత ఎద్దేవా చేశారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎందుకు స్పందించడం లేదని, చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె నిలదీశారు.