కడవెరుగులో ఘనంగా హరే రామ హరే కృష్ణ నగర సంకీర్తన
కడవెరుగులో ఘనంగా హరే రామ హరే కృష్ణ నగర సంకీర్తన
హరినామ స్మరణతో మార్మోగిన గ్రామ వీధులు.. భక్తి పారవశ్యంలో గ్రామ ప్రజలు
చేర్యాల: చేర్యాల మండలం కడవెరుగు గ్రామంలో హరే రామ హరే కృష్ణ నగర సంకీర్తనను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తుల హరినామ స్మరణలు, భజనలు, కీర్తనలతో గ్రామ వీధులు మార్మోగాయి. గ్రామస్థులు, యువత, పెద్దలు కులమతాలకు అతీతంగా పాల్గొని శ్రీరామ, శ్రీకృష్ణ నామస్మరణతో ఆధ్యాత్మిక సందడి చేశారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందించడంతో పాటు సనాతన ధర్మ సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.