వందేళ్ల వయసులోనూ ప్రజాస్వామ్యంపై చెక్కుచెదరని నిబద్ధత
చిట్టమూరు మేజర్ న్యూస్
ప్రజాస్వామ్య పండుగలో ఓటు హక్కు విలువను చాటుతూ చిట్టమూరు మండలంలోని కోగిలి బీసీ కాలనీకి చెందిన శతాధిక వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు కోగిలిలో వందేళ్లు పైబడిన శతాధిక వృద్ధురాలు గురువారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,చిట్టమూరు మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ రషీద్ స్వయంగా చొరవ తీసుకుని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఓటు వేసేలా సహకరించారు.దీంతో ఆ శతాధిక వృద్ధురాలు తన విలువైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.వయసు వందేళ్లు దాటినా ఓటు హక్కుపై ఉన్న బాధ్యతను చాటుకున్న వృద్ధురాలు పలువురికి ఆదర్శంగా నిలిచారు.
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్