ఎల్లకొండలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవాబుపేట్, మేజర్ న్యూస్: చేవెళ్ల నియోజకవర్గం నవాబుపేట్ మండలం ఎల్లకొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటి లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన పేదలకు సొంత ఇంటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.