ప్రజ్ఞాభారతి పాటల పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థులకు ప్రథమ బహుమతి
సూర్య కరీంనగర్: వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజ్ఞాభారతి నిర్వహించిన పాటల పోటీల్లో కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. పదో తరగతి విద్యార్థి ఏ. అభిరామ్ ప్రథమ బహుమతి సాధించగా, వి. శ్రీనిధి ప్రోత్సాహక బహుమతి గెలుచుకుంది.ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన సభకు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలను అభినందించారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు దేశభక్తి భావనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విజేతలకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.