BREAKING
ఎల్లకొండలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మా పొలాలు తడపండి సారూ… అభివృద్ధికి నిధులు.. ఎమ్మెల్యేకు పాలాభిషేకం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారెడ్డి కుటుంబానికి బీజేపీ నాయకుల పరామర్శ ఓటర్లతో సందడిగా దేవాంగపురి పోలింగ్ కేంద్రాలు ఆరోగ్యకరమైన భూమే మన సంపద హృదయాన్ని కదిలించిన రక్తదానం.. ప్రజ్ఞాభారతి పాటల పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థులకు ప్రథమ బహుమతి సీఎం సోదరుల అండదండలతోనే అక్రమాలు పోలింగ్ బూత్‌లను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ చాబోలు, వెంకటాపురం పోలింగ్ కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గ్రామాలభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయం. - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఓటు హక్కును వినియోగించుకున్న మాలేపాటి భవాని కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది – తన్నీరు నాగేశ్వరరావు కడవెరుగులో ఘనంగా హరే రామ హరే కృష్ణ నగర సంకీర్తన

ఆరోగ్యకరమైన భూమే మన సంపద

Select Suryaa Now
ఆరోగ్యకరమైన భూమే మన సంపద

సైదాపూర్: వెన్నంపల్లి రైతు వేదికలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ఖేత్ బచావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్ మాట్లాడుతూ.. భూసారాన్ని కాపాడుకోవడం ప్రతి రైతు బాధ్యతన్నారు. విత్తన శుద్ధి చేయడంతో పాటు రసాయన ఎరువులకు బదులుగా జీవ ఎరువులు వినియోగించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. వీలుకాని రైతులు సాధారణంగా వేసే వరి విస్తీర్ణంలో సగం మాత్రమే సాగు చేసి పంటను కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ ప్రేమ్‌సాగర్, వెన్నంపల్లి సర్పంచ్ చిరంజీవి, లస్మన్నపల్లి సర్పంచ్ మ్యాకల స్వప్న-సంపత్ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు పంతంగి రవీందర్ గౌడ్, రైతులు పాల్గొన్నారు.