పోలింగ్ బూత్‌లను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్
హొళగుంద,సూర్య ప్రతినిధి :కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని హొళగుందలో ఓటింగ్ సరళిని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్జి పరిశీలించారు. గురువారం నిర్వహిస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియ, ఓటర్ల హాజరు, ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
– టి. ఉమాపతి సూర్య, ప్రతినిధి హొళగుంద కర్నూలు జిల్లా