మా పొలాలు తడపండి సారూ…
సూర్య, జన్నారం : జన్నారం మండలం తిమ్మాపూర్, రాంపూర్ గ్రామాల రైతులు గురువారం సాగునీరు అందించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. గత రెండు రోజుల క్రితం నుండి కడెం ప్రాజెక్ట్ నుండి పొలాలకు నీళ్లు వదలకపోవడంతో చివరి ఆయకట్టు రైతులు ఆందోళనకు గురయ్యారు. తిమ్మాపూర్, రాంపూర్ రైతులు ఈ నెల 30వ తేదీ వరకు నీళ్లు వదలకపోతే మాకు ఆత్మహత్యలే దిక్కు అని రైతులందరూ వాపోయారు. ఈ ధర్నాలో జన్నారం మండల మాజి సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు జాడి గంగాధర్ తో పాటు తిమ్మాపూర్, రాంపూర్ గ్రామాల రైతులు పాల్గొన్నారు.