BREAKING
సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి జడ్పిటిసి అభ్యర్థి పెళ్లూరు సౌజన్య రెడ్డి వైఎస్సార్‌సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హౌస్ అరెస్ట్ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి సీనియర్ జర్నలిస్టు విరాళం వరద కాలువలో పడిపోయిన వ్యక్తిని కాపాడిన పోలీసులు, స్థానికులు**ఉట్లపల్లి సమీపంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం ఎన్టీఆర్ జిల్లా కలగర పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత: పోలీసుల జోక్యం స్థానిక ఎన్నికల పోలింగ్ సరళిని స్వయంగా పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... బేతుపల్లి చెరువులో గల్లంతైన ఎస్డిఆర్ఎఫ్ సభ్యులు సురక్షితం గోవర్ధనగిరిలో ముమ్మరంగా సాగుతున్న పోలింగ్.. ఎండలోనూ క్యూలైన్లలో మహిళలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు కలెక్టర్, ఎస్పి ఓటు హక్కును వినియోగించుకున్న పలమనేరు శాసనసభ్యులు మురసు తుపాను నేపథ్యంలో పంటలు నష్ట పోయిన రైతులకు ఎకరా నికి ₹25 వేలు నష్ట పరిహారం చెల్లించాలని biబిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు, మాజీ జడ్పిటిసి సున్నం నాగమణి డిమాండు చేస్తుంది* కంభంపాడులో పోలింగ్ కేంద్రం వద్ద మహిళా ఓటర్ల బారులు కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ ఓటర్ల అసహనం.. తాగునీటి వసతి కూడా లేదని ఆవేదన ఎన్నికలను బహిష్కరించిన రొంగళివానిపాలెం గ్రామస్తులు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్.. 11 గంటలకు 21.18 శాతం నమోదు

వైఎస్సార్‌సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హౌస్ అరెస్ట్

Select Suryaa Now
 వైఎస్సార్‌సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హౌస్ అరెస్ట్
నంద్యాల:నంద్యాల జిల్లా పగడాలపల్లె మండలం ముచ్చుమర్రి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పోలీసులు గురువారం ఉదయం ఆయన స్వగృహంలోనే హౌస్ అరెస్ట్ చేశారు.

స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధార్థరెడ్డి సొంత ఊరైన ముచ్చుమర్రికి వచ్చారు. ఈ క్రమంలో ఓటు వేసేందుకు ఆయన ఇల్లు దాటి బయటకు వస్తుండగా, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు ఆయనను అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఎన్నికల వేళ గ్రామంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా మరియు ఇరువర్గాల మధ్య గొడవలు జరగకుండా చూసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే, సిద్ధార్థరెడ్డి హౌస్ అరెస్ట్‌తో ఆయన మద్దతుదారులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండటంతో ముచ్చుమర్రిలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.