బేతుపల్లి చెరువులో గల్లంతైన ఎస్డిఆర్ఎఫ్ సభ్యులు సురక్షితం
సత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్.:బేతుపల్లి చెరువులో గల్లంతైన 6 మంది మత్స్యకారులను సహాయక చర్యల్లో భాగంగా ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురు ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని, 4 మంది అగ్నిమాపక సిబ్బందిని ఎన్డిఆర్ ఎఫ్ బృందం సురక్షితంగా రక్షించారు. రాత్రంతా బేతుపల్లి చెరువు వద్దే ఉండి, సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ, బాధితుల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం కృషి చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అంకితభావం పట్ల స్థానిక ప్రజలు, మత్స్యకారులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పరిస్థితిని నివేదిస్తూ, అవసరమైన యంత్రాంగాన్ని, సహాయక వనరులను సమకూర్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ కి స్థానిక ప్రజలు, మత్స్యకారుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఘటనపై ప్రత్యేక చొరవ చూపుతూ, సహాయక చర్యలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంత్రులు పొంగులేటి, తుమ్మలకు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, సహాయక సిబ్బంది, మత్స్యకారుల కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
కిరణ్ కుమార్ ఆరిక, .సత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్.