BREAKING
విధి నిర్వహణలో మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబానికి ₹1 కోటి చెక్కు పంపిణీ -జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమిది చారిత్రాత్మక విజయం పెదవోగిరాలలో టీడీపీ కార్యకర్తలపై దాడి.. వైసీపీపై మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆగ్రహం ఎన్నికల్లో గెలిచినా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు రైస్ మిల్లుల వద్ద రోజుల తరబడి పడిగాపులు.. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ఒత్తిడి చేస్తేనే ధర పెంపునకు అంగీకారం.. అకాల గాలివానలతో ఇప్పటికే నష్టాల్లో అన్నదాతలు మిల్లర్ల తీరుపై రైతుల ఆగ్రహం.. అధికారుల పర్యవేక్షణ ఏదీ? టిడిపిబీసీ నేతపై వైసీపీ నాయకులు దాడి అఖిలభారత రైతు మహా సభలను జయప్రదం చేయండి పాంచాలి నగర్ అంగన్వాడీ కేంద్రం వద్ద చెత్త కుప్పలు. మహిళలపై దాడిని ఖండిస్తూ శాలిగౌరారం మండల పాస్టర్స్ ఫెలోషిప్ నిరసన దక్షిణ ఆఫ్రికా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎఎన్‌సి (ANC) కి భారీ షాక్ తుర్కియేలో మాజీ మంత్రికి జైలు శిక్ష ఉక్రెయిన్‌లో వందలాది హోటళ్లను అక్రమంగా స్వాధీనం చేసుకున్న రష్యా ఎక్స్ (X) డిజిటల్ రైట్స్ గ్రూప్‌లను టార్గెట్ చేస్తూ వచ్చిన టేక్‌డౌన్ నోటీసులు బూటకం మంత్రి నారాయణ వ్యూహాత్మక అడుగులు నెల్లూరు పీఠంపై కూటమి జయభేరి... ఎం&ఎం క్యూ2 ఫలితాల్లో జోరు: మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ వ్యూ

ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యం: మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న

Select Suryaa Now
ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యం: మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న

 సూర్య కరీంనగర్: నగరంలోని కాలనీల ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నిరంతర తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న తెలిపారు. శుక్రవారం 11వ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీలో నూతన తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు విషయమై కాలనీవాసులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదతో కలిసి కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించి ప్రతి ఇంటికి మెరుగైన నీటి సౌకర్యం అందించేందుకు నూతన పైప్‌లైన్ ఏర్పాటు చేయాల్సిన అవసరంపై చర్చించారు. ప్రజల అభిప్రాయాలు, అవసరాలకు అనుగుణంగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాలనీవాసులు పాల్గొన్నారు.