టిడిపిబీసీ నేతపై వైసీపీ నాయకులు దాడి
టిడిపి నేతపై వైసీపీ నాయకులు దాడికి యత్నం
సూర్య న్యూస్ ముండ్లమూరు. మండలంలోని మారెళ్ళ గ్రామానికి చెందిన టిడిపి బీసీ నాయకుడు పై వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించారని ముండ్లమూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ గ్రామానికి చెందిన టిడిపి నాయకులు ,రాష్ట్ర కృష్ణబలిజ సంఘం కార్యదర్శి డాక్టర్ పాశం వెంకటేశ్వరావు పై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి మారెళ్ళ గ్రామంలో తెలుగుదేశం కి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని ఆక్రోషంతో గురువారం రాత్రి తన ఇంటి వద్ద నే తనపై అదే గ్రామానికి చెందిన మైల శ్రీరాములు, బాబు గురవయ్య దాడి చేశారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యస్. ఐ కోటేశ్వరరావు తెలిపారు. టిడిపి నేత వెంకటేశ్వరరావు మండల టిడిపి నాయకులు పరామర్శించారు.