BREAKING
బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పోరాటంపై కోటంరెడ్డి ప్రశంసలు నన్ను నమ్ముకుని నడిచిన చిన మస్తాన్‌కు అధికార పార్టీ నుంచి అవకాశం కల్పించలేకపోయాను: ఎమ్మెల్యే కోటంరెడ్డి కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి షురూ: త్వరలోనే వివాహ బంధంలోకి కావ్య కల్యాణ్ రామ్, కాల భైరవ! మంత్రిని కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్ 30వ డివిజన్ విజేతకు ఎమ్మెల్యే అభినందనలు ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోర ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం వరుణ్ సందేశ్ 'యద్భావం తద్భవతి' టీజర్ విడుదల: లాంచ్ చేసిన ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్! ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య బాక్సాఫీస్ వద్ద సూర్య హ్యాట్రిక్ విజయం: 'సీన్' సినిమాకు అద్భుతమైన స్పందన! “విద్య – వసతి – వికాసం” కార్యక్రమానికి రూ.10 లక్షల విరాళం రజనీకాంత్ పాత సినిమా టైటిల్‌తో సంతానం కొత్త ప్రయోగం: టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో 'అదిశయ పిరవి'! డీసీసీబీ ధనవృద్ధి సహకార డిపాజిట్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి..........బ్రాంచ్ మేనేజర్ వి. కీర్తి సుధ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి.. అశ్వారావుపేట పోలీసుల అవగాహన!* కొర్ర ద్వాదశి సందర్భంగా గోమాతకు పూజలు

బోటు ప్రమాదంలో తమిళ జాలర్ల మృతి ఘటనపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం

Select Suryaa Now
బోటు ప్రమాదంలో తమిళ జాలర్ల మృతి ఘటనపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం

అమరావతి, మేజర్‌న్యూస్‌ :

మురసు తుపాను అలజడిలో తమిళనాడుకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో మునిగి ఏడుగురు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ ద్వారా బోటు ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బోటు ప్రమాదానికి గురైన సమయంలో 9 మంది మత్స్యకారులు అందులో ఉండగా, ఇప్పటి వరకు ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో ఇద్దరి ఆచూకీ లభించలేదని కలెక్టర్ వివరించారు. గల్లంతైన వారి కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకార బృందాల సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రివర్యులు సూచించారు. మృతదేహాల గుర్తింపు, పోస్టుమార్టం ప్రక్రియ త్వరగా పూర్తి చేసి వారి స్వస్థలాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. తుపాను హెచ్చరికల సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సముద్రంలో అలజడులకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలియబరుస్తూ,  ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం చేశారు.