బాపట్ల, గుంటూరు జిల్లాల్లో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
అమరావతి, మేజర్‌న్యూస్ :
• మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
• మధ్యాహ్నం 12.30 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లనున్న సీఎం
•బాపట్ల మండలం జిల్లెలమూడి వంతెన వద్ద తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాన్ని పరిశీలించనున్న ముఖ్యమంత్రి.
•దెబ్బతిన్న డ్రెయిన్స్‌పై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
• సమీక్ష అనంతరం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రేటూరు గ్రామానికి వెళ్లి రైతులను కలిసి సమస్యలు తెలుసుకోనున్న సీఎం.