మహిళలపై దాడిని ఖండిస్తూ శాలిగౌరారం మండల పాస్టర్స్ ఫెలోషిప్ నిరసన
రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలోని ఆల్మాస్‌గూడ మారుతీనగర్‌లో ఇద్దరు క్రైస్తవ యువతులపై జరిగిన దాడిని శాలిగౌరారం మండల పాస్టర్స్ ఫెలోషిప్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు నిరసనగా ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నిందితులుగా పేర్కొన్న లక్ష్మీనారాయణ, శశివర్ధన్‌తో పాటు దాడిలో పాల్గొన్న వారందరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై మతం పేరుతో జరుగుతున్న దాడులను అరికట్టాలని, రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని కోరారు.
ప్రతి ఒక్కరికీ భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను, మహిళల గౌరవాన్ని కాపాడాలని, రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ విలువలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్స్ ఫెలోషిప్ బాధ్యులు: అధ్యక్షులు: పాస్టర్ ఇశ్రాయేలు,గౌరవ అధ్యక్షులు: పాస్టర్ బాలరాజు,ఉపాధ్యక్షులు: రమేష్ ప్రధాన కార్యదర్శి: లాజర్. సహాయ కార్యదర్శి: అంబేద్కర్,కోశాధికారి: ఎలీషా. గౌరవ సలహాదారులు: ఆశీర్వాదం, డేవిడ్, సీమోను. కార్యవర్గ సభ్యులు: హానోక్ శ్యామ్‌సన్, సాల్మన్ రాజు, ఏసుపాదం, శ్యాంబాబు. తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.